రాజధానికి ధీటుగా గ్రేటర్ వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్: తెలంగాణలో రెండవ పెద్ద నగరమైన వరంగల్‌కు గ్రేటర్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట మూడు పట్టణాలను కలిపి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చుతున్నట్టు తెలంగాణ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ మూడు పట్టణాలను విలీనం వల్ల వరంగల్ నగర జనాభా 10 లక్షలకు చేరుకుంటుంది.

జవహార్ నెహ్రు జాతీయ పట్టణ పునరుద్ధరణ పథకం (జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం) కింద కేంద్రం నుంచి నిధులు పొందడానికి పది లక్షల జనాభా కలిగి, చారిత్రక నగరం అయివుడాలి. ప్రస్తుతం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జనాభా ఆరున్నర లక్షలు మాత్రమే ఉంది.

‘Greater’ tag to Warangal Corporation

దీంతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోకి వరంగల్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (వుడా) పరిధిలోకి వచ్చే 42 గ్రామాలను విలీనం చేయడంతో నగర జనాభా 10 లక్షలకు చేరుకుంది. దీంతో వరంగల్ నగరానికి గ్రేటర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాజధానికి ధీటుగా తీర్చిదిద్దండి: సిఎం కెసిఆర్

పారిశ్రామిక, విద్యారంగంలో రాజధాని హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్‌ను తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. వరంగల్ నగరానికి గ్రేటర్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బుధవారం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్, మున్సిపల్‌శాఖ కమిషనర్ బి జనార్ధన్‌రెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలతో కూడిన వరంగల్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. చారిత్రత్మకంగా, పర్యాటకపరంగా వరంగల్ నగరానికి ఉన్న ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ హోదా కల్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వరంగల్ నగరానికి గ్రేటర్ హోదా కల్పించడంతో తెలంగాణలో గ్రేటర్ హోదా కలిగిన రెండవ నగరంగా స్థానం పొందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+