ముహూర్తం వేళలో వరుడి పరారీ: టీవీ చూడ్డానికి వస్తే హత్యాయత్నం

నల్గొండ/ హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌ మండలం డోముల గ్రామంలో ముహూర్త సమయానికి పెళ్లికుమారుడు పారిపోయాడు. దీంతో పెళ్లి నిలిచిపోయింది.

డోముల గ్రామానికి చెందిన మాచర్ల శైలేష్‌ కుమార్‌కు, సూర్యాపేట మండలం బాలిమ్ల గ్రామానికి చెందిన రేణుకతో వివాహం నిశ్చయమైంది. అయితే అకస్మాత్తుగా పెళ్లికొడుకు కనిపించకుండా పోయాడు.

దాంతో పెళ్లికూతురు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అడిగిన మొత్తం కట్నకానుకలు ఇస్తామన్నా కూడా అబ్బాయి తప్పించుకుని పోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Groom escapes from the wedding venue

ఇదిలావుంటే, నల్గొండ జిల్లాలోని సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్‌లో దారుణం జరిగింది. పక్కింట్లో టీవీ చూసేందుకు వెళ్లిన ఆరేళ్ల బాలిక మాన్వితపై ఓ మానసిక వికలాంగురాలు కిరోసిన్‌ పోసి నిప్పటించింది. ఈ సంఘటనలో బాలిక మాన్విత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో బాలికను ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం ఉమర్‌ఖాన్‌గూడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+