చక్రం సినిమాలో హీరో ప్రభాస్‌లా పెళ్లనగా వరుడు పరారీ

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. చక్రం సినిమాలో హీరో ప్రభాస్ మాదిరిగా కాసేపట్లో పెళ్లి అనగా వరుడు పారిపోయాడు. ఈ సినిమాలో ప్రభాస్ మరికాసేపట్లో పెళ్లనగా పారిపోతాడు. సరిగ్గా అలాంటే సంఘటనే చోటు చేసుకుంది.

ప్రభాస్ ఆ సినిమాలో వ్యాధి కారణంగా అలా వెళ్లిపోతే ఇక్కడ పెళ్లి కుమారుడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. కట్నం డబ్బులు 3 లక్షల రూపాయలు జేబులో వేసుకుని పారిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అచ్యుతాపురం కాలనీలో ఈ సంఘటన జరిగింది.

 Groom escapes like Prabhas in chakram film

మరి కాసేపట్లో తమ కూతురును ఓ అయ్య చేతిలో పెడుతామని, తమ బాధ్యతులు తీరుతాయని ఆశపడిన పెళ్లి కూతురు తల్లిదండ్రులకు తీవ్ర విషాదమే మిగిలింది. కూతురి పెళ్లి అర్థాంతరంగా ఆగిపోవడంతో ఏం చేయాలో పాలుపోక వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.

పెళ్లి కుమారుడు ఎందుకు పారిపోయాడు, అందుకు సంబంధించిన కారణాలు ఏమిటనేది తెలియక తికమక పడుతున్నారు. కేవలం డబ్బుల కోసమే అలా చేశాడా, మరేదైనా కారణం ఉందా అనే ఆలోచనలో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+