వైఎస్ జగన్ బిజినెస్ ప్లాన్ సత్తా తేలింది..!!
అమరావతి: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. 2022 డిసెంబర్ లో రికార్డు స్థాయి ఆదాయం నమోదైంది. 2021 సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 15 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 26 శాతం మేర అధికంగా ఈ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో ఈ సంఖ్య 11 శాతానికే పరిమితమైంది.

ఐజీఎస్టీ వాటా..
2022 డిసెంబర్ లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,49,507 కోట్ల రూపాయలు. 2021 డిసెంబర్ తో పోల్చుకుంటే ఈ సంఖ్య 15 శాతం అధికం. 2021 నవంబర్‌లో నమోదైన జీఎస్టీ వసూళ్లు 1,29,780 కోట్ల రూపాయలు. జీఎస్టీ రాబడి 1,40,000 కోట్లను దాటుకోవడం వరుసగా ఇది 11వ నెల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బ్రేకప్ ఇదీ..
2022 డిసెంబర్ లో వచ్చిన జీఎస్టీ ఆదాయంలో అధిక వాటా ఐజీఎస్టీదే. సీజీఎస్టీ వాటా 26,711 కోట్ల రూపాయలు. ఎస్‌జీఎస్టీ- 33,357 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ- 78,434 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయం 40,263 కోట్ల రూపాయలను ఇందులోనే విలీనం చేశారు. ఇక సెస్ రూపంలో అందిన మొత్తం 11,005 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 850 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు.

ఏపీలో పెరుగుదల..
కాగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల 26 శాతంగా నమోదైంది. 2021లో ఇదే నవంబర్‌లో వచ్చిన జీఎస్టీ వసూళ్లు 2,532 కోట్ల రూపాయలు. కాగా 2022లో అదే డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు 3,182 కోట్ల రూపాయలకు పెరిగాయి. తెలంగాణతో పోల్చుకుంటే 25 శాతం అధికంగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 11 శాతంగా నమోదైంది.

తెలంగాణ కంటే..
2022 డిసెంబర్ లో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 4,178 కోట్ల రూపాయలు. 2021లో డిసెంబర్ లో 3,760 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో అందాయి. ప్రతి నెల కూడా తెలంగాణ కంటే ఏపీలో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు నమోదవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. హైదరాబాద్ వంటి నగర్ ఏపీకి లేకపోయినప్పటికీ- రెవెన్యూ ఏనెలకానెల భారీగా పెరుగుతోండటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న సానుకూల విధానాలకు అద్దం పట్టినట్టవుతోంది.

రాష్ట్రాలవారీగా..
రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.410 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.708 కోట్లు, పంజాబ్-రూ.1,734 కోట్లు, చండీగఢ్-రూ.218 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,253 కోట్లు, హర్యానా-రూ.6,678 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-4,401 కోట్లు, రాజస్థాన్-3,789 కోట్లు, ఉత్తర ప్రదేశ్-రూ.7,178 కోట్లు, బిహార్-రూ.1,309 కోట్లు, సిక్కిం-రూ.290 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.67 కోట్లు, నాగాలాండ్-రూ.44 కోట్లు, మణిపూర్-రూ.46 కోట్లు, మిజోరం-రూ.23 కోట్లు, త్రిపుర-రూ.78 కోట్లుగా నమోదయ్యాయి.

మహారాష్ట్రలో..
మేఘాలయ-రూ.171, అస్సాం-రూ.1,150 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.4,583 కోట్లు, జార్ఖండ్-రూ.2,536 కోట్లు, ఒడిశా-3,854 కోట్లు, ఛత్తీస్‌గఢ్-2,585 కోట్ల రూపాయల మేర జీఎస్టీ రెవెన్యూను అందుకున్నాయి. మధ్యప్రదేశ్-రూ.3,079 కోట్లు, దాద్రానగర్ హవేలి-రూ.317 కోట్లు, గుజరాత్-9,238 కోట్లు రికార్డయ్యాయి. మహారాష్ట్ర-రూ.23,598 కోట్లు, కర్ణాటక-రూ.10,061 కోట్లు, గోవా-రూ.460 కోట్లు, కేరళ-రూ.2,185 కోట్లు, తమిళనాడు-రూ.8,324 కోట్లు, పుదుచ్చేరి-రూ.192 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.21 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications