జీఎస్టీ గుడ్ న్యూస్: 80 శాతం వస్తువులపై పన్ను తగ్గింపు! టీటీడీని మినహాయించాలని ఏపీ
అధిక పన్ను స్లాబు (28 శాతం) పరిధిలో ఉన్న 80 శాతం వస్తువులపై పన్ను రేటు తగ్గనుందని బీహార్ ఉప ముఖ్యమంత్రి, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు సుశీల్ కుమార్ మోడీ తెలిపారు.
ఢిల్లీ/తిరుమల: అధిక పన్ను స్లాబు (28 శాతం) పరిధిలో ఉన్న 80 శాతం వస్తువులపై పన్ను రేటు తగ్గనుందని బీహార్ ఉప ముఖ్యమంత్రి, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు సుశీల్ కుమార్ మోడీ తెలిపారు.
గురువారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారు. బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

80 శాతం వస్తువులపై పన్ను రేటు తగ్గించే అవకాశం
28 శాతం పన్ను శ్లాబులో ఉన్న 80 శాతం వస్తువులపై పన్ను రేటు 18 శాతానికి తగ్గించే అవకాశముందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా 18 శాతం స్లాబులో ఉన్న వస్తువుల పైనా పన్ను రేటును కూడా 12 శాతానికి తగ్గిచాలని జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ సూచించిందని చెప్పారు.

100కు పైగా వస్తువులపై పన్ను రేటు తగ్గనుంది
సుమారు 100కు పైగా వస్తువులపై పన్ను రేటు తగ్గనుందని సుశీల్ మోడీ తెలిపారు. అసోం రాజధాని గౌహతిలో ఈ నెల 9, 10 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుందని చెప్పారు.

జీఎస్టీ నుంచి టీటీడీని మినహాయించాలని
ఇదిలా ఉండగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. జీఎస్టీ నుంచి టీటీడీని మినహాయించాలని ఆయన తన లేఖలో కోరారు.

వ్యాపారులు తగ్గించడం లేదు, చర్యలు తీసుకోవాలి
జీఎస్టీ వల్ల కొన్ని వస్తువుల రేట్లు తగ్గినా వ్యాపారస్తులు తగ్గించడం లేదని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. రేట్లు తగ్గించని వారిపై కేంద్రం చర్యలు ఆయన కోరారు. సామాన్యులు వాడే వస్తువులపై పన్ను తగ్గించాలని కోరారు. ఈ-వే బిల్లులు ప్రవేశ పెట్టాలన్నారు.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications