'థియేటర్లో సినిమా చూసినా, హోటల్‌లో ఫుడ్ తిన్నా అదనపు భారాలే'

సినిమా చూసినా, హోటల్ తిండి తిన్నా అదనపు పన్ను తప్పదని జిఎస్టీ అనలిస్ట్ లక్ష్మణ రావు శుక్రవారం మీడియాతో అన్నారు.జిఎస్టీతో అన్ని అదనపు భారాలేనని చెప్పారు.

విజయవాడ: సినిమా చూసినా, హోటల్ తిండి తిన్నా ఇక అదనపు పన్ను తప్పదని, జిఎస్టీతో అన్ని అదనపు భారాలేనని జిఎస్టీ అనలిస్ట్ లక్ష్మణ రావు శుక్రవారం మీడియాతో అన్నారు.

ఒక దేశం ఒక పన్ను విధానం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశం, ఒక వస్తువు, ఒక పన్ను నిజం అని ఆయన అన్నారు. నెలకు రూ.30 వేలు ఖర్చు పెట్టే సామాన్యుడిపై రూ.3వేల భారం పడుతుందన్నారు.

GST: Watching movies at cinema halls to cost you more

అలాగే, సినిమా చూసినా, హోటల్‌లో ఏమైనా తిన్నా అదనపు పన్ను పడుతుందన్నారు. జిఎస్టీ పరిధిలో ఉన్న యజమాని ఇంట్లో అద్దెకు దిగితే 18 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుందన్నారు.

బంగారం కొంటే అదనంగా ఒక శాతం పన్ను ఉంటుందని, ఏడాది పాటు జిఎస్టీ భారం పడుతుందన్నారు. అంతేకాకుండా జిఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టమని చెప్పారు. రైస్ మిల్లులో బియ్యం కొంటే జిఎస్టీ ఉండదని, బ్రాండెడ్ రైస్, ప్యాకేజీ అయిన ఆహారంపై పన్ను తప్పదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+