వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ సినిమా అట్టర్ ఫ్లాప్ - బహు భార్యలంటూ : మంత్రి అమర్నాధ్ సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై మంత్రి గుడివాడ అమర్నాధ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. చంద్రబాబు డైరెక్షన్లో మూడు నెలలుగా బ్రహ్మాండమైన సినిమా నడుపుతున్నారని .. అది అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయం అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన అంటూ ఫైర్ అయ్యారు. జనసేనకు సిద్ధాంతాలు లేవు.. చంద్రబాబు కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. రైతులను మోసగించిన చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్ ప్రభుత్వాన్ని పవన్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.

కౌలు రైతుల కష్టాలకు చంద్రబాబు కారణమని దత్త పుత్రుడు తెలుసుకోవాలని మంత్రి అమర్నాధ్ వ్యాఖ్యానించారు. ఒక లోకల్, ఒక నేషనల్,ఒక ఇంటర్నేషనల్ ఇదీ పవన్ కళ్యాణ్ బహు భార్యత్వం తీరు అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. చంద్రబాబు సొంత పుత్రుడు పనికి రాడని.. దత్త పుత్రుడు వెంట పడుతున్నారని అమర్నాధ్ ఎద్దేవా చేసారు. ఎక్కడా జగన్ కేసులపై శిక్షలు పడలేదన్నారు. అప్పటి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి చేసిన కుట్ర అని ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని విమర్శించారు.

Gudivada Amarnath sensational comments against Pawan Kalyan

చంద్రబాబు చేత.. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన అని అమర్నాథ్‌ మండిపడ్డారు. వైసీపీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ లేని వాడంటూ మంత్రి అమర్నాధ్ మండిపడ్డారు. అక్రమంగా పెట్టిన కేసుల్లో 16నెలలు జైల్లో ఉంటే నేరగాళ్లు అనడానికి పవన్ కళ్యాణ్ కు హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. అతితక్కువ కాలంలో ఎక్కువ పొత్తులు పెట్టుకున్న రాజకీయ పార్టీగా జనసేనది వరల్డ్ రికార్డ్ అని ఎద్దేవా చేసారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని విమర్శించారు.

English summary
AP Minister Gudivada Amaranth sensationa remarks against Janasena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X