Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ రెఫరెండం డిమాండ్: ఓడిపోవటానికే చంద్రబాబు తాపత్రయం; గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రెఫరెండం అవుతాయని, టిడిపి అసెంబ్లీ రద్దు చెయ్యాలన్న రెఫరెండం డిమాండుకు గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్, ఐదేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయని, ప్రజలు తమకు ఐదేళ్లు తీర్పు ఇచ్చారని, అలాంటప్పుడు తాము ఎందుకు అసెంబ్లీ రద్దు చేయాలంటూ ప్రశ్నించారు.

చంద్రబాబువి మంగమ్మ శపధాలు .. ఓడిపోవటానికే బాబు తాపత్రయం

చంద్రబాబువి మంగమ్మ శపధాలు .. ఓడిపోవటానికే బాబు తాపత్రయం


ఇక శాసనసభ సమావేశాలు జరిగితే సభకు రానని చంద్రబాబు మంగమ్మ శపధాలు చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు వస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట ఎమ్మెల్యేలు వినడంలేదో లేక వాళ్ళ మాట చంద్రబాబుకు అర్థం కావడం లేదో తెలియదని గుడివాడ అమర్నాథ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరికైనా గెలవడానికి తాపత్రయం ఉండాలని కానీ చంద్రబాబుకు ఓడిపోవడానికి తెగ తాపత్రయం గా ఉందన్నారు. అందుకే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదామని రెఫరెండం డిమాండ్ పెడుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

కుప్పంలో ఎలా గెలవాలో చూసుకో చంద్రబాబు

కుప్పంలో ఎలా గెలవాలో చూసుకో చంద్రబాబు

చంద్రబాబు ముందు కుప్పంలో ఎలా గెలవాలో చూసుకుంటే మంచిది అంటూ గుడివాడ అమర్నాథ్ సలహా ఇచ్చారు. ఎందుకంటే తాము రాష్ట్రంలో గెలిచే మొదటి స్థానమే కుప్పం అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. తమకు ఇప్పుడు రాజీనామాలు చేసే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తేల్చిచెప్పారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని, కేవలం చంద్రబాబు అండ్ గ్యాంగ్ తమ స్వార్ధ రాజకీయాలకోసం రాజధాని వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

కాక రేపుతున్న మూడు రాజధానుల రగడ.. టీడీపీ రెఫరెండం డిమాండ్ తో మళ్ళీ రచ్చ

కాక రేపుతున్న మూడు రాజధానుల రగడ.. టీడీపీ రెఫరెండం డిమాండ్ తో మళ్ళీ రచ్చ

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ 3 రాజధానుల వ్యవహారం కాక రేపుతుంది. తెలుగుదేశం పార్టీ తాజాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలతో రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు మూడు ముక్కల రాజధాని పై జగన్ కు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట మార్చారని, మూడు రాజధానుల రిఫరెండం గా తీసుకొని జగన్ ఎన్నికలకు వెళ్లాలని టీడీఎల్పీ సమావేశం వేదికగా టిడిపి సవాల్ చేసింది. ఇక ఈ క్రమంలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ టిడిపి రెఫరెండం తో ఎన్నికలకి వెళ్లాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+