అమరావతి యాత్ర కాదు-విశాఖపై దండయాత్ర-బాబుదే బాధ్యత-మంత్రి అమర్నాథ్ వార్నింగ్
ఏపీలో అమరావతి రైతులు త్వరలో అరసవిల్లికి చేపట్టనున్న పాదయాత్ర కలకలం రేపుతోంది. ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినా రైతులు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో వైసీపీ మంత్రులు ఈ పాదయాత్రపై దాడిని మరింత తీవ్రతరం చేశారు.
అమరావతి-అరసవిల్లికి రాజధాని రైతులు చేపట్టబోతున్న పాదయాత్రకు హైకోర్టు అనుమతివ్వడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విశాఖ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని అమర్నాథ్ ఆరోపించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని ఆయన తెలిపారు. అమరావతి రైతులు చేపడుతోంది పాదయాత్ర కాదు.. అది విశాఖపై దండయాత్ర అని అమర్నాథ్ వ్యాఖ్యానించారు..

అమరావతి రైతులు చేపడుతున్న పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరని మంత్రి అమర్నాథ్ తెలిపారు.
పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. మూడు రాజధానులపై కొత్త బిల్లుతో వస్తామని తెలిపారు. బిల్లు పెట్టిన తరువాత ఎప్పుడైనా సీఎం జగన్ విశాఖ రావొచ్చన్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన ఉంటుందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications