Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gudivada Assembly Election 2024 Results LIVE: గుడివాడలో కొడాలి నాని వెనుకంజ

ఉమ్మడి కృష్ణాజిల్లాలో గుడివాడ నియోజకవర్గం కీలకమైనది. టీడీపీ వ్యవస్థాపకుడు సొంత నియోజకవర్గంగా గుడివాడ పేరు గాంచింది. అయితే 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా నందివాడ‌, గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లాల‌ను పూర్తిగా గుడివాడ‌లో క‌లిపేశారు. గ తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న పామ‌ర్రు, పెద‌పారుపూడి మండ‌లాల‌ను పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో చేర్చారు. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గం లో మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వ‌హించారు. 1983,85 లో ఇక్క‌డి నుండి ఎన్టీఆర్ గెలుపొందారు.

1985 లో మూడు చోట్ల గెలిచిన ఘ‌న‌త ఎన్టీఆర్ సొంతం. టీడీపీ ఆవిర్భావం త‌రువాత ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో రెండు సార్లు మిన‌హా ప్ర‌తీ సారి టీడీపీ గెలుస్తూ వ‌చ్చింది. 2004, 2009 లో టీడీపీ నుండి గెలిచిన కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు(నాని) 2009 లో గెలిచిన త‌రువాత రాష్ట్రంలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో భాగంగా వైసీపీలో చేరారు. ఆ త‌రువాత అన‌ర్హ‌త వేటుకు గురై వైసీపీ నుండి 2014 లో పోటీ చేశారు. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 18 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు, టీడీపీ ఎనిమిది సార్లు, సిపిఐ రెండు సార్లు, వైసీపీ రెండుసార్లు విజయం సాధించాయి.

AP assembly election results gudivada Assembly Election 2024 Results voting counting live updates news in telugu

2014 ఎన్నిక‌ల్లో గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 197311 ఓట్లు ఉండ‌గా, అందులో 157682 ఓట్లు పోల‌య్యాయి. వైసీపీ నుండి పో టీ చేసిన కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావుకు 81298 ఓట్లు రాగా, టీడీపీ నుండి పోటీ చేసిన రావి వెంక‌టేశ్వ‌ర‌రావుకు 69761 ఓట్లు వ‌చ్చాయి. వైసీపీ నుండి పోటీ చేసిన కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు (నాని)11537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2019లో కూడా కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు (నాని)నే విజయం సాధించారు.

ఆ ఎన్నికల్లో కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు (నాని)కి 89,833 ఓట్లు పోల్ కాగ, టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్‌కు70,354 ఓట్లు వచ్చాయి.దీంతో కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు (నాని) 19,479 మెజారిటీతో వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు (నాని) పోటీ చేయగా, టీడీపీ నుంచి ఎన్నారై వెన్నిగండ్ల రాము బరిలో దిగారు. టీడీపీకి కొరకరాని కొయ్యి మాదిరిగా తయ్యారైన కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు (నాని)ని ఎలాగైనా ఓడించాలని కసితో ఉంది టీడీపీ. దీనిలో భాగంగానే వెన్నిగండ్ల రామును రంగంలోకి దించడం జరిగింది.

పైగా ఈసారి కమ్మ సామాజికవర్గం ఓట్లన్నీ కూడా ఒన్‌సైడ్‌గా టీడీపీకి పడినట్టు పోలింగ్ సరళిని చూస్తే అర్థం అవుతోంది. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన గుడివాడలో తనని ఓడించలేరని ధీమాతో ఉన్నారు కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు (నాని). ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు వైసీపీకి మద్దతుగా నిలిచాయని తెలుస్తోంది. బీసీ, కమ్మ సామాజికవర్గాలు టీడీపీకి సపోర్టు చేశాయి. కొడాలి నాని ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+