పవన్ రీ రిలీజ్ మూవీ కలెక్షన్లు జనసేనకు: బాగానే వసూలయ్యాయ్..!!
Pawan Kalyan: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలూ సమయాత్తమౌతోన్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
వైఎస్ఆర్సీపీని గద్దె దించడానికి తెలుగుదేశం- జనసేన పార్టీ జట్టు కట్టాయి. ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం సీట్ల పంపకాల వరకు వచ్చింది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్‌లో కలుసుకున్నారు పవన్ కల్యాణ్. సీట్ల పంపకాలపై చర్చించినట్లు వార్తలొచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. దీనికోసం అవసరమైన నిధులను సమీకరించుకుంటోంది. ఇందులో భాగంగా- జనసేన సీనియర్ నాయకుడు నాగబాబు 35 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళాల రూపంలో పార్టీకి అందజేశారు. దీనికి సంబంధించిన చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు అందజేశారు.

పవన్ కల్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాను రీ-రిలీజ్ చేయడం ద్వారా వచ్చిన మొత్తం అది. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా రీ రిలీజ్ అయింది. తొలుత ఆగస్టు 31వ తేదీన విడుదల చేయాలని భావించినప్పటికీ పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడం వల్ల సెప్టెంబర్ 2కు వాయిదా వేసుకున్నారు.
గుడుంబా శంకర్ చిత్ర ప్రదర్శన ఆదాయం.. జనసేన పార్టీకి అందజేత
— JanaSena Party (@JanaSenaParty) December 14, 2023
శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి చెక్ రూపంలో రూ. 35 లక్షలు అందించిన శ్రీ నాగబాబు గారు @NagaBabuOffl pic.twitter.com/dzLaTPgO0b
రీ రిలీజ్‌లో ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. ఖర్చులన్నీ పోను నిర్మాత నాగబాబుకు 35 లక్షల రూపాయల టేబుల్ ప్రాఫిట్‌ను అందించింది. ఈ మొత్తాన్ని జనసేన పార్టీ ఫండ్‌గా అందించారాయన. 2004లో విడుదలైన ఈ మూవీని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నాగబాబు నిర్మించిన విషయం తెలిసిందే.
నాదెండ్ల మనోహర్‌కు చెక్‌ను అందించిన అనంతరం నాగబాబు మాట్లాడారు. అంతకుముందు ఆరెంజ్, జల్సా రీ రిలీజ్ ద్వారా వచ్చిన రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని జనసేనకు అందించామని, అదే సంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని అన్నారు. ఈ మొత్తాన్ని పవన్ కల్యాణ్.. మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications