కొడాలి నాని ఉక్కిరి బిక్కిరి - గుడివాడలో కీలక పరిణామం..!!

మాజీ మంత్రి కొడాలి నాని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొడాలి నాని టార్గెట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో కొడాలి నాని వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. దీంతో, టీడీపీ నేతలు నాని పైన గురి పెట్టారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాల పైన ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుడివాడలో కొడాలి నాని పైన కేసు నమోదు అయింది. పలు సెక్షన్ల కింద ఈ కేసులను నమోదు చేసారు.

నాని పై గురి
వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత వరుస నిర్ణయాలు జరుగుతున్నాయి. తాజా ఎన్నికల్లో ఓడిన కొడాలి నాని గతంలో చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఇంటి పైన దాడికి ప్రయత్నించారు. కోడిగుడ్లు విసిరి నినాదాలు చేసారు. ఆ తరువాత గుడివాడలో కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

Guidvada Police registered case against Kodali nani with three sections

కేసు నమోదు
తాజాగా, నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై కేసు నమోదు అయ్యింది. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆత్మరక్షణలో నాని
2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బేవరెజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని ఫిర్యాదు దారుడు దుగ్గిరాల ప్రభాకర్ చెబుతున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.... పద్మా రెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బేవరెజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాధవిలత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సహకారంతో ప్రయత్నించారన్నారు. కొడాలి నాని అనుచరులు తమపై బెదిరింపులకు దిగారని చెప్పుకొచ్చారు. తమ గోడౌన్ లో ఉన్న లిక్కర్ కేసులను పగల కొట్టి తగలబెట్టారని... ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. దీంతో, వరుస కేసులతో కొడాలి నాని పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+