వైసీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి - పదవి ఖరారు చేసిన జగన్..!!
స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కీలక పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి. శ్రీకాకుళంలో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్న గుండ కుటుంబం ఈ రోజు వైపీపీలో చేరింది. మాజీ సీఎం జగన్ సమక్షంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన మద్దతు దారులతో కలిసి వైసీపీలో చేరారు. మాజీ సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మీదేవికి కీలక పదవి ఖరారు చేసారు.
మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 40 ఏళ్లుగా పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నాయకురాలు గుండ లక్ష్మీదేవి పార్టీకి రాజీనామా చేశారు. తన ముఖ్య అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుండ లక్ష్మీదేవి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుబంధం ఉంది. ఆమె భర్త, దివంగత మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా.. తాజా స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకున్న సమీకరణాల్లో భాగంగా లక్ష్మీ దేవికి ప్రాధాన్యత దక్కలేదు.

జగన్ కీలక దిశా నిర్దేశం
దీంతో.. లక్ష్మీ దేవితో శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు చర్చలు జరిపారు. శ్రీకాకుళంలో బలమైన నేత గా ఉన్న లక్ష్మీదేవి రాకతో పార్టీకి బలం పెరుగుతందని అంచనా వేస్తున్నారు. దీంతో, శ్రీకాకుళం మేయర్ సీటు లక్ష్మీదేవికి ఇవ్వాలని మాజీ సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో శ్రీకాకుళం కు ఎన్నిక జరగటం లేదు. డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంది. దీంతో.. జిల్లా నేతలతో చర్చించిన తరువాత జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. శ్రీకాకుళం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్థానిక ఎన్నికల పైనా చర్చించారు. ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా లక్ష్మీ దేవి రాక పార్టీకి అదనపు బలంగా వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా తూర్పు గోదావరికి చెందిన మరో నేత వైసీపీలో చేరేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications
