ఇక ఆత్మహత్యే.. జడ్జీ ముందు పోసాని కృష్ణమురళి కన్నీటి పర్యంతం

Posani Krishna Murali: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు బుధవారం గుంటూరులోని జడ్జీ ఎదుట హాజరుపర్చారు. ఈ క్రమంలో జడ్జీ ముందు పోసాని బోరున విలపించారు.

తన ఆరోగ్యం బాగాలేదని, రెండుసార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కన్నీటిపర్యంతమయ్యారు. రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని న్యాయమూర్తి ఎదుట వాపోయాడు. ఇరు వైపులా వాదనలు విన్న జడ్జీ.. పోసానికి 14 రోజుల (మార్చి 26వ తేదీ వరకు) రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.

Guntur Posani tears up before judge says he will commit suicide

కాగా, సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హోకోర్టు కొట్టివేసింది. మరోవైపు, కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులో పోసానికి మంగళవారం మొదటి అదనపు జూనియర్ జడ్జీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో పీటీ వారెంట్ పై గుంటూరుకు తీసుకొచ్చిన అధికారులు.. సీఐడీ కోర్టులో హజరుర్చారు.

పోసాని కృష్ణమురళి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశారని పోసాని జడ్జీ ముందు తెలిపారు. ఈ కేసులో 111 సెక్షన వర్తించదని పేర్కొన్నారు. ఈ క్రమంలో జడ్జీ ముందు పోసాని కన్నీటిపర్యంతమయ్యారు. తాను తప్పు చేస్తే నరికేయండని అన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమన్నారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జీ.. మార్చి 26 వరకు రిమాండ్ విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+