గుంటూరు రైల్లో రేప్ కేసు నిందితుడు చెప్పింది విని పోలీసులకు చెమటలు!
ఏపీలోని గుంటూరు, పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య రైలులోనే అత్యాచారం చేసిన ఘటన అందరినీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి విచారణలో అనేక భయానక విషయాలు వెలుగు చూశాయి.
ఏపీలో రైల్లో మహిళా బోగీలో ఒంటరిగా మహిళ
ఇటీవల ఒక మహిళ గుంటూరు నుంచి చర్లపల్లి కి వెళ్లడానికి రైలు ఎక్కింది. రైలు సత్ర గంజ్ నుండి చర్లపల్లి కి వెళుతున్న సమయంలో రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో రైలు ఆగినప్పుడు మహిళా కోచ్ లో ఒంటరిగా ఉన్న మహిళను చూసి ఒక వ్యక్తి ఆమె మహిళా కోచ్ అని చెప్తున్నా వినకుండా ఆ బోగీలోకి ఎక్కాడు.

ఏపీలో మహిళపై రైల్లో అత్యాచారం కేసు
గుంటూరు పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య సదరు వ్యక్తి ఆ మహిళను కత్తితో బెదిరించి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను శారీరకంగా, లైంగికంగా వేధించాడు. ఆపై ఆమె వద్ద ఉన్న 5,600 రూపాయలను, మొబైల్ ఫోన్ ఉన్న ఒక హ్యాండ్ బ్యాగ్ ను దొంగతనం చేశాడు. పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ రాగానే దూకి పారిపోయాడు. ఆ తర్వాత మహిళ రైలు చర్లపల్లి చేరుకున్నాక రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడిని పట్టుకున్న పోలీసులు
జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రైల్వే పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నడికుడి పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు. కాగా మహిళ సెల్ ఫోన్ లోని సిమ్ సదరు వ్యక్తి వినియోగించటం వలన సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసులు మూడు రోజులుగా ఆ వ్యక్తిని విచారణ చేస్తున్నారు.
గతంలో కేరళలోనూ మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు
ఈ విచారణలో అతను గతంలో ఎనిమిది నెలల క్రితం కేరళలోనూ ఇదే తరహాలో ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పాడు. అంతేకాదు పెదకూరపాడు దగ్గర రైలు నిదానంగా వెళ్తున్న క్రమంలో రైలు నుండి దూకి అక్కడ నుండి పత్తి చేల మీదుగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ సత్తెనపల్లి బస్సు ఎక్కాడు.ఇక బాధితురాలి నుండి గుంజుకున్న సెల్ ఫోన్ ను అమ్ముకుని బిర్యానీ తిన్నాడు. ఆ తర్వాత సత్తెనపల్లిలో రైలెక్కి గుంటూరు వెళ్ళాడు.
నిందితురాలి సిమ్ వాడటంతో పట్టుకున్న పోలీసులు
గుంటూరు నగర వీధుల్లో రెండు గంటల పాటు చక్కర్లు కొట్టాడు. తరువాత మరో రైలెక్కి తెనాలిలో దిగాడు. నిందితురాలి సిమ్ వాడటంతో అతడిని పోలీసులు పట్టుకున్నారు. విచారణలో అతను అంతకు ముందు చేసిన దారుణాల తాలూకు భయానక విషయాలు చెప్పాడు. దీంతో పోలీసులు మరింత కూపీ లాగుతున్నారు.












Click it and Unblock the Notifications