గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువకులారా! ప్రేమ విషయంలో జాగ్రత్త: సెల్ఫీ సూసైడ్ కలకలం, పవన్ కళ్యాణ్ గెలవాలని ఆకాంక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలో తెనాలి యువకుడు వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య సంఘటనను అతను రెండు గంటల నిడివి గల వీడియో తీసుకున్నాడు. అది ఫోన్లో రికార్డ్ అయింది. రెండు పేజీల సూసైడ్ లేఖ కూడా రాశారు.

యువకులారా, ప్రేమ విషయంలో జాగ్రత్త

యువకులారా, ప్రేమ విషయంలో జాగ్రత్త

ప్రేమ కారణంగా తన జీవితం నాశనం అయిందని, యువకులు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. పోలీసులు వీడియోను సీజ్ చేశారు. ఓ యువతిని ప్రేమించడం వల్ల తన జీవితం నాశనమైందని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. యువకుల్లారా ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని సూచించారు. ప్రేమ విషయంలో తొందరపడొద్దని పేర్కొన్నాడు.

 ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అద్భుత అవకాశాలు: ఇండియాలో 4 కోట్ల ఉద్యోగాలు ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అద్భుత అవకాశాలు: ఇండియాలో 4 కోట్ల ఉద్యోగాలు

 లాడ్జిలో ఆత్మహత్య

లాడ్జిలో ఆత్మహత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వంశీకృష్ణ విజయవాడలోని ఓ ప్రయివేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం గవర్నర్‌పేటలోని ఓలాడ్జిలో దిగాడు. మంగళవారం మధ్యాహ్నం లాడ్జి సిబ్బందికి కనిపించాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో తలుపులు కొట్టారు.

 అనుమానాస్పద మృతిగా

అనుమానాస్పద మృతిగా

అతను తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా గదిలో అతను ఉరి వేసుకొని కనిపించాడు. సూసైడ్ నోట్‌ను బట్టి అతను ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ గెలవాలని ఆకాంక్ష

పవన్ కళ్యాణ్ గెలవాలని ఆకాంక్ష

అతను తన తల్లి, సోదరి ఫోన్‌ నంబర్లను కూడా సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన గురించి ఆలోచించవద్దన్నారు. తాను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అభిమానిని అని, ఆయనను ఒక్కసారి కూడా చూడలేదని, వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపొందాలంటూ ఆకాంక్షించారు.

English summary
Guntur District's Tenali youth shoots selfie video before suicide in Vijayawada on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X