బజారు రౌడీలకంటే: టిడిపిపై గుత్తా, తెరాసకోరితే: ఎర్రబెల్లి

errabelli dayakar rao and gutta sukhender reddy
నల్గొండ/వరంగల్: న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తించారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలో ధ్వజమెత్తారు. తెలంగాణను అడ్డుకునేందుకు న్యాయవాదులకు కోట్లు ఖర్చు చేసిన సీమాంధ్ర టిడిపి నేతలు బ్రిజేష్ కమిటీ తీర్పు పైన ఎందుకు సొంతగా పిటిషన్ వేయలేదో చెప్పాలన్నారు.

సీమ నేతల పాలనలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాదులో కొడవళ్లు, దౌర్జన్యాలకు మారుపేరు సీమ నేతలు అని విమర్సించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ దూరంగా ఉంటారన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దీక్షలు రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. తాము పది జిల్లాల తెలంగాణ కోసమే పోరాడుతున్నామని చెప్పారు.

రాజకీయ లబ్ధి కోసమే కెసిఆర్: విహెచ్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ వి హనుమంత రావు అన్నారు. ఆయన సోనియా కృతజ్ఞత యాత్ర నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కొనసాగుతోంది. రాయల తెలంగాణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రాయల టి అంటే ప్రజలు కాంగ్రెసు పార్టీకి దూరమవుతారని హెచ్చరించారు. పది జిల్లాల తెలంగాణే కావాలని, తెలంగాణ సాధించే వాళ్లం తామే అన్నారు.

తెరాస కోరితే: ఎర్రబెల్లి

రాయల తెలంగాణకు తాము వ్యతిరేకమని టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో అన్నారు. అవసరమైతే ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలన్నారు. రేపటి బందు పైన తెరాస తమను సంప్రదిస్తే సహకరిస్తామని చెప్పారు. రాయల టికి నిరసనగా ఢిల్లీలో తాము ఆందోళన చేపడతామన్నారు. రాయల టి కుట్రపూరితమైనదని, టి కాంగ్రెసు నేతలు విజయోత్సవ సభలు మాని అధిష్టానంపై పది జిల్లాల తెలంగాణ కోసం ఒత్తిడి తీసుకు రావాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+