రేవంత్ పదవి కోసమే, పేదల జీవితాలతో కేసీఆర్: కిషన్
హైదరాబాద్: తెలంగాణలో టిడీపీ నాయకత్వాన్ని దక్కించుకునేందుకు రేవంత్ రెడ్డి అదే పనిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును విమర్శిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దిన కోరుకుంటున్న తెలంగాణ టీడీపీ నేతలను తెలంగాణ ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.
తెలంగాణ అభివృద్దికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేస్తున్న కృషిని గుర్తించే తెలంగాణ తెలుగుదేశం నేతలు తెలంగాణ రాష్ట్ర సమతిలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమతిలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ నేతలను ఆపడం రేవంత్ రెడ్డికి చేతకాలేదని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో చేస్తున్న బస్సు యాత్ర తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకేనని ఆయన అన్నారు.
పేదల జీవితాలతో కేసీఆర్ చెలగాటం: కిషన్

పేదల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రణాళిక తప్ప మరే ప్రణాళిక ప్రభుత్వానికి లేదని, రాష్ట్రాన్ని అంధకారలోకి నెడుతున్నారని ఆయన తీవ్ర స్దాయిలో విమర్శించారు.
పెన్షన్లు, స్కాలర్ షిఫ్‌ల వ్యవహారంపై ప్రభుత్వ వైఖరేమిటో, నియమనిబంధనలేమిటో మళ్లీ ఎందుకు దరఖాస్తులు చేసుకోవాలో వివరించాలని అన్నారు. అదనపు విద్యుత్తు కోసం కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించడం లేదని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆచరణలో పెట్టలేదని... సమగ్ర సర్వే ఎందుకు చేశారో కనీసం కేసీఆర్‌కైనా తెలుసా అంటూ ధ్వజమెత్తారు. సామాన్య ప్రజాజీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతుందోని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications