అమిత్ షా - జూ ఎన్టీఆర్ భేటీ వెనుక - సినిమా కాదు : తేల్చేసిన బీజేపీ నేత..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జూ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా ఈ అంశం పైన చర్చ సాగుతోంది. ఈ భేటీ వెనుక అనేక రకాల విశ్లేషణలు వచ్చాయి. సినిమా అంశాలా ..లేక, రాజకీయ అంశాల పై చర్చ జరిగిందా అనే దాని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఇదే అంశం పైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా వెలుగు లోకి వచ్చిన మద్యం స్కాం లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధాల పైన ప్రచారం సాగుతోంది.

సినిమా అంశంపై కాదు
దీని పైన మాట్లాడిన జీవీఎల్ దీని పైన పూర్తి విచారణ సాగుతుందన్నారు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణల పైన పలు రకాల అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. లిక్కర్ స్కాంలో వస్తున్న ఆరోపణలు చూస్తుంటే..గ్రేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇక.. అమిత్ షా - జూ ఎన్టీఆర్ మధ్య సినిమాల అంశం పైన భేటీ జరిగిందని తాను భావించటం లేదని స్పష్టం చేసారు. రాజకీయ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఏం చర్చించారనేది వారిద్దరికే తెలియాలన్న జీవీఎల్.. బీజేపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి ఉన్నారంటూ వ్యాఖ్యానించటం కొత్త చర్చకు కారణమవుతోంది.

పార్టీలో చేరికలు ఉంటాయి
బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెబుతూ.. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. అమిత్ షా .. జూ ఎన్టీఆర్ భేటీ పైన రాజకీయ పార్టీలు ఎక్కువగా చర్చిస్తున్నాయని చెప్పారు. అమిత్ షా తో భేటీ పైన వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పైన నమ్మకం లేకనే.. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం అయ్యారని చెబుతున్నారు. త్వరలోనే టీడీపీ పగ్గాలు జూనియర్ తీసుకొనే విధంగా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందంటూ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగానే చర్చ జరిగిందంటూ
ఇదే సమయంలో..పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర ఎన్టీఆర్ ను తమ పార్టీకి మద్దతుగా బీజేపీ ప్రచారం చేయించుకొనే అవకాశం ఉందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ప్రధాని మోదీ..అమిత్ షా ఎవరితోనూ సమావేశాలు నిర్వహించరని వ్యాఖ్యానించారు. అయితే, ఇది రాజకీయాలకు అతీతంగా జరిగిన సమావేశంగా బీజేపీ నేతలు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఢిల్లో ముఖ్యులతో సత్సంబంధాలు కలిగిన జీవీఎల్ మాత్రం...ఇది సినిమాలకు సంబంధించిన సమావేశంగా భావించటం లేదంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. దీని ద్వారా ఇప్పుడు మరోసారి ఈ సమావేశం పైన విశ్లేషణలు మొదలయ్యే అవకాశం ఉంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications