అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్, అరెస్ట్
విశాఖపట్నం: అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న జిమ్‌కోచ్ అలెక్స్(50)ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖ బీచ్ రోడ్డులో ఫిట్‌నెస్ ట్రేనింగ్ సెంటర్‌తో పాటు ఇంటిరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్న అలెక్స్ గత కొంత కాలంగా అమ్మాయిలను ప్రేమలోకిదించి వారికి తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళలకు మాయమాటలు చెప్పి వారిని కారులో ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు.

కారులో సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసిన అతడు తన దుశ్చర్యను రికార్డు చేసి, ఆ తర్వాత బాధిత యువతులను నిత్యం వేధింపులకు గురి చేస్తుంటాడు. లైంగిక వేధింపులతో పాటు బాధిత యువతుల వద్ద డబ్బు కూడా గుంజుతుంటాడు. అతని బాధితుల్లో సుమారుగా 200 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవల ఒక ఇంటర్ చదివే అమ్మాయిని ట్రాప్ చేసి రూ. 50,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. టెన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్ధ సహకారంతో ఓ యువతి అతడిని పోలీసులకు పట్టించింది. వివాహితుడైన అలెక్స్ వీఐపీ రోడ్డులోని సీవ్యూ అపార్టుమెంట్‌లో నివాసముంటున్నాడు.
పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పక్కాగా ఆధారాలు లభించడంతో అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఫోన్ ఆధారంగా బాధితులను గుర్తించి వారికి న్యాయం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications