HBD Mahesh Babu.. ఫ్యాన్స్‌ను నిద్రపోనివ్వలేదు: కొత్త పోస్టర్‌తో పూనకాలు
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా టీజర్.. అదరగొట్టింది. మహేష్ బాబు స్టామీనాను చాటి చెప్పింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. ఈ టీజర్‌కు. మహేష్ బాబులోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. తలకు ఎర్ర టవల్, నోట్లు బీడీ, మాసిన గెడ్డం, గళ్ల చొక్కాతో అసలు సిసలు మాస్ మహారాజా అనిపించాడు మహేష్.

ఇవ్వాళ ఆయన బర్త్‌డే. 47వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. అయినప్పటికీ.. ఏ మాత్రం ఆయన ఛరిష్మా చెక్కుచెదరలేదు. పైగా మరింత అందంగా తయారవుతున్నాడు. కోట్లాది మంది అభిమానులకు గుంటూరు కారం యూనిట్ నిద్ర లేకుండా చేసింది. మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని అర్ధరాత్రి సరిగ్గా 12:06 నిమిషాలకు గుంటూరు కారం పోస్టర్‌ను యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ కోసం అభిమానులు నిద్రమానుకుని మరీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వెయిట్ చేశారు. మహేష్ బాబు పుట్టినరోజును సందర్భంగా యూనిట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్.. సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసేలా చేసింది.

ఈ కొత్త పోస్టర్‌లో మాస్ లుక్‌తో కనిపించారు మహేష్ బాబు. కూలింగ్ గ్లాసెస్ ధరించి.. సిగరెట్ వెలిగిస్తూ ఇచ్చిన స్టిల్ అది. గళ్ల చొక్కా, లుంగీతో అదరగొట్టాడు. హ్యాపీ బర్త్‌డే టు సూపర్ స్టార్.. అనే క్యాప్షన్ ఈ పోస్టర్‌పై కనిపించింది. దీన్ని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ .. తన ట్విట్టర్ హ్యాండిల్‌పై సరిగ్గా 12:06 నిమిషాలకు పోస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications