శ్రీకాకుళంతో పాటు ఆ జిల్లావాసులు ఉబ్బితబ్బిబ్బయ్యే వార్త.. ఆ అమృత్ భారత్ రైళ్ళ హాల్టింగ్!
భారతీయ రైల్వే తన రవాణా సౌకర్యాలను మెరుగు పరుచుకుంటూ తన ప్రస్తానాన్ని సాగిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం మాత్రమే, శరవేగంగా అనేక కొత్త లైన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇదే సమయంలో పలు ప్రాంతాలకు ప్రజలు డిమాండ్ మేరకు కొన్ని రైళ్లను హాల్టింగ్ ఇస్తూ తెలుగు రాష్ట్రాలలో అందరికీ మెరుగైన రైలు రవాణాను అందిస్తోంది.
పెందుర్తిలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్
తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఏపీ వాసులకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు రైళ్లకు కొత్త హాల్టింగ్ స్టేషన్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా బాలూర్ ఘాట్ నుంచి ఎస్ ఎన్ విటి బెంగళూరు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పెందుర్తిలో హాల్టింగ్ స్టాప్ ను కేటాయించింది.

బారువా రైల్వేస్టేషన్లో ఆ రైలుకు హాల్టింగ్
జనవరి 17వ తేదీన బాలూర్ ఘాట్లో ప్రారంభమై ఈ రైలు ఆదివారం నాడు పెందుర్తి రెండో ప్లాట్ఫాం పైన పది నిమిషాల పాటు నిలిచింది. ఈ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పర్యవేక్షించారు. మరోవైపు భువనేశ్వర్ విశాఖపట్నం ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బారువా రైల్వేస్టేషన్లో హాల్టింగ్ పాయింట్ మంజూరు అయింది. ఇక దీనిని ఆదివారం నాడు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ జెండా ఊపి ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆ మార్గంలో కొత్త రైల్వే హాల్టింగ్ పాయింట్ లు
సోంపేట ప్రాంత 23గ్రామాలు ప్రజలు ఈ రైలు హాల్టింగ్ స్టాప్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక సంక్రాంతికి వచ్చిన చాలామంది తమకు సౌకర్యవంతంగా రైలు సమీపంలో ఉన్న స్టేషన్లో ఆగడంతో ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. రైలు గంటన్నర ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రజలు మాత్రం సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా జలుమూరులో తిలారు రైల్వేస్టేషన్లో బ్రహ్మపుత్ర విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కొత్త స్టాప్ లభించింది.
ఇచ్చాపురం, కంచిలి రైల్వే స్టేషన్ లలోనూ స్టాప్ లు
అదేవిధంగా ఇచ్చాపురం, కంచిలి రైల్వే స్టేషన్లలోనూ కొన్ని రైళ్లకు స్టాప్స్ లభించాయి. ఇచ్చాపురంలో మూడు వీక్లీ రైళ్ళు ఇకనుండి హాల్ట్ అవుతాయి. పూరి- అహ్మదాబాద్, రాధిక పూర్- smvt బెంగళూరు, రంగాపాణి- నాగర్ కోయిల్, న్యూజల్ పాయి గురి- తిరుచినాపల్లి స్పెషల్ అమృత్ భారత్ రైళ్లు ఆదివారం నుండి ఆగుతాయి. దీంతో ఇక్కడ కూడా ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.
అమృత్ భారత్ రైలుకు దూర ప్రయాణాలు సులభతరం
ఈ రైల్వే స్టేషన్ల హాల్టింగ్ వల్ల ప్రయాణికులకు సౌకర్యం మెరుగవుతుంది. ముఖ్యంగా అమృత్ భారత్ రైలు దూర ప్రయాణాలను సులభతరం చేస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఈ రైళ్లను శ్రీకాకుళం జిల్లాలలో హాల్టింగ్ చేయడంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కందాళం అశోక్ పాత్రను ప్రజలు కొనియాడుతున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications