Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హరహర మహాదేవ.. ఏపీలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు; కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు!!

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో, శ్రీకాళహస్తిలో, అమరావతిలోని అమర లింగేశ్వర స్వామి, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయంలో పోటెత్తారు. శివనామస్మరణలతో శ్రీకాళహస్తి ఆలయం మార్మ్రోగిపోతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు.

Harahara Mahadeva maha Shivaratri celebrations in AP devotees rush in famous temples

భక్తులు క్యూలైన్లలోనే మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. అలాగే భక్తులకు ఉచిత అన్నప్రసాదం, అల్పాహారాన్ని కూడా అందిస్తున్నారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అలాగే కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శివరాత్రి పర్వదినం కావడంతో పలువురు ప్రముఖులు శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్సించుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో రాష్ట్రప్రభుత్వం తరపున ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

ఇదిలా ఉంటే శ్రీశైలంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.శ్రీశైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏడవ రోజు గజ వాహానంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవారికి నేడు మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవదాయశాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.

మహాశివరాత్రిపర్వదిన సందర్భంగా పశ్చి మగోదావరి జిల్లాలోని శివ క్షేత్రాలన్నీ భక్తులతో కిట కిట లాడుతున్నా యి. గోదావరి తీరం శివనామ స్మరణలతో మార్మోగుతోంది. పంచారామ క్షేత్రాలైన భీమవరంలోని శ్రీఉమా సోమేశ్వ ర జనార్ధన స్వామి ,పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాలలో భక్తులు తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో నిలబడ్డారు . స్వామివారికి పాలాభిషేకాలు నిర్వహించారు. మరోవైపు గుంటూరు జిల్లా అమరావతి అమర లింగేశ్వర ఆలయంలోనూ భక్తులు పోటెత్తారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని హుకుంపేట మండలం మత్స్యగుండంలో శివరాత్రి మహోత్సవాలు ప్రభుత్వం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. భక్తులు సందర్శకులకు ఉత్సవ కమిటీ ప్రభుత్వ అధికారులు త్రాగునీరు, రవాణా సదుపాయం కల్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+