గర్ల్‌కు కాబోయే భర్తకి బంధువు అసభ్య మెసేజ్, ఫోటోలు

యువకుడి బంధువులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు. దీంతో వారు విషయాన్ని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం... చిక్కడపల్లిలో శశికాంత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తన బంధువైన యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
ఆ యువతికి కొద్ది రోజుల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఎలాగైనా పెళ్లి చెడగొట్టాలనుకున్నాడు. అతడి స్నేహితుడి ఈ మెయిల్ నుండి యువతిని పెళ్లి చేసుకోబోయే యువకిడికి అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. సదరు యువతి మరో వ్యక్తిని ప్రేమిస్తోందంటూ.. కొన్ని ఫోటోలను జత చేశాడు.
యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. నిందుతుడు నేరాన్ని అంగీకరించడంతో అతనిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications