జనసేనకు ఈ సీట్లు ఇవ్వకుంటే టీడీపీ అనుభవించాల్సిందే - జోగయ్య వార్నింగ్..!!
ఏపీలో ఎన్నికల వేళ సీట్ల రాజకీయం కీలకంగా మారుతోంది. పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాల పైన చర్చలు జరుగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్ల కోసం జనసేన పట్టుబడుతోంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో జత కలుస్తుందనే ప్రచారం సాగుతోంది.
కానీ, బీజేపీ నుంచి స్పష్టత రాలేదు. ఈ సమయంలోనే జనేనకు కేటాయించాల్సిన సీట్ల పైన మాజీ ఎంపీ హరి రామ జోగయ్య లేఖ రాసారు. జన సేనకి ఇవ్వాల్సిన సీట్లు కేటాయించకపోతే జరిగే నష్టానికి టీడీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో జనసేన మెజార్టీ సీట్ల కోరుకుంటోంది. ఈ సీట్ల వ్యవహారం పైన మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య రాసిన లేఖ కలకలం రేపుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉందని గుర్తు చేసారు. టీడీపీ గెలవాలంటే జనసేన మద్దతు దారుల ఓట్లు కీలకంగా ఉంటాయని వివరించారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీని ఓడించాలంటే జనసేన మద్దతు దారులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు ఆ పార్టీకే కేటాయించాలని జోగయ్య సూచించారు.

అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం ఎంపీ స్థానంతో పాటుగా అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు, నిడుదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉండి నియోజవకర్గాలకు కేటాయించాని డిమాండ్ చేసారు.
ఈ సీట్లను జనసేనకు దక్కకపోతే జరిగే నష్టానికి ..పర్యవసానాలకు టీడీపీ బాధ్యత వహించాలని జోగయ్య హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన ఇప్పటికే రాజానగరం, రాజోలు సీట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమ గోదావరిలో సీట్ల పంపకాల పైన తాజాగా జోగయ్య చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ ఏ రకంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications