చీరలాగి జయలలితకు, ఎన్టీఆర్‌కు అలా.. గెలిచారు: హరికృష్ణ

దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, జయలలితలు తమను అవమానపర్చిన వారి పైన శపథం చేసి గెలిచారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు.

విజయవాడ: దివంగత ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, జయలలితలు తమను అవమానపర్చిన వారి పైన శపథం చేసి గెలిచారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు.

రెండు రోజుల క్రితం, సోమవారం రాత్రి పదకొండున్నర గంటలకు జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు మంగళవారం సాయంత్రం చెన్నైలోని మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిగాయి. జయ మృతి నేపథ్యంలో హరికృష్ణ ఆ ఛానల్‌తో మాట్లాడారు.

Harikrishna praises Jayalalithaa and NTR

జయలలిత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆమె చీర లాగి అవమానించారని గుర్తు చేశారు. తనను అవమానానికి గురి చేసిన వారిని ఓడించిన తర్వాతే తాను అసెంబ్లీలోకి అడుగు పెడతానని జయ శపథం చేశారని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెట్టారని చెప్పారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను అవమానించారని చెప్పారు. వారిని ఇంటికి పంపించిన తర్వాతే తాను అసెంబ్లీకి వస్తానని ప్రకటించారని, తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం అందించారన్నారు. ఈ ఇద్దరు ఉక్కు నేతలు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+