రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు మృతి
నల్లగొండ: నందమూరి కటుంబంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలో శనివారం సాయంత్రం దారుణం జరిగింది. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరాం దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. మునగాల మండలం, ఆకుపాముల దగ్గర జాతీయ రాహదారిపై యూటర్న్ తీసుకుంటున్న ట్రాక్టర్‌ను, జానకిరాం ప్రయాణిస్తున్న టాటా సఫారీ(ఎపీ29బీడీ2323) బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో జానకిరాంకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కోదాడ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకిరాం మరణించారు. ఈ ఘటనతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నందమూరి హరికృష్ణ, కల్యాణ్‌రామ్ కోదాడకు పయనమయ్యారు.

జానకిరామ్ స్వయంగా కారు నడిపాడు. కారు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోలేదని సమాచారం. జానకిరామ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. జానకీరామ్‌కు భార్య దీపిక, కుమారులు ఎన్టీఆర్, సౌమిత్రి ఉన్నారు.
ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ మాసాబ్‌ట్యాంకులోని స్వగృహానికి తరలించనున్నారు. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. జానకిరామ్ అతనొక్కడే లాంటి సినిమాలను నిర్మించారు.
జానకీరామ్ ప్రయాణిస్తున్న కారు మూరు రౌండ్లు గుండ్రంగా తిరిగి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న గుంతలో పడింది. ఆ ప్రమాదంలో జానకీరామ తలకు, వెన్మెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications