వైయస్ జగన్‌తో చేతులు కలిపిన నందమూరి హరికృష్ణ!
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో నందమూరి హరికృష్ణ చేతులు కలిపారు! బుధవారం నాడు వీరు ఇద్దరు ఓ పెళ్లిలో తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు కలిశారు. పరస్పరం క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి భరత్ వివాహ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ బుధవారం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేటకు వెళ్లారు. జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పెళ్లికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావమరిది, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తారసపడ్డారు.












Click it and Unblock the Notifications