జగన్ జేబులోనిదే: రామజోగయ్య ఆగ్రహం, పార్టీకి గుడ్‌బై

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో జగన్ పార్టీకి ఇది మరో ఎదురు దెబ్బ. పార్టీ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్ భై చెప్పనున్నట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో రామజోగయ్య అసంతప్తిగా ఉన్నారు. పార్టీ విధానాలు అస్తవ్యస్తంగా మారడంతో హరిరామ జోగయ్య విసిగిపోయారట. ఎన్నికల ముందు ఇలా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యనేతలంతా పార్టీని వీడడం జగన్ పార్టీకి పెద్ద దెబ్బ అంటున్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ లక్షణాలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కనిపిస్తున్నాయని హరిరామ జోగయ్య గతంలో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చిరంజీవి పార్టీలా తయారవుతుందని ఆయన అప్పుడు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications