డిగ్గీపై హర్ష కుమార్ ఫైర్, జగన్‌కు తొందరెందుకని ప్రశ్న

అధిష్టానం వ్యవహారం చూస్తే జగన్‌తో కుమ్మక్కై విభజన అంశాన్ని వేగవంతం చేసినట్లు సామాన్యుడికి కూడా అనుమానం కలుగుతోందన్నారు. ఆంటోని కమిటీతో తాము మూడుసార్లు కూర్చున్నామని, అన్నిసార్లు ఈ కమిటీ షిండే చర్చించిన తర్వాతే కేబినెట్ నోట్ తయారవుతుందని చెప్పారని, ఆంటోని ఆసుపత్రి నుండి బయటకు వచ్చి, ఈసారి సీమాంధ్రలో పర్యటించి వచ్చిన తర్వాత షిండేతో మాట్లాడుతారని, అనంతరం కేబినెట్ నోట్ తయారవుతుందని చెప్పారని అన్నారు.
మీడియాకు కూడా ఇదే విషయాన్ని చెప్పమని డిగ్గీ తమతో అన్నారని, ఇప్పుడు యూ టర్న్ తీసుకొని నోట్‌కు, ఆంటోని కమిటీకి సంబంధం లేదనటం బాగాలేదన్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి తప్పితే ఇలా మాట్లాడటం ఏమాత్రం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి ఓ ప్రాంతానికి పరిమితం కారాదని కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానిస్తున్నారని, అదే సమయంలో దిగ్విజయ్ తాను ఎపి కాంగ్రెసు వ్యవహారాల ఇంఛార్జ్ తప్పితే తెలంగాణకు కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు.
త్వరగా అసెంబ్లీ సమావేశపర్చాలని జగన్ పార్టీ హడావుడి చేయడంపై ఆన అనుమానం వ్యక్తం చేశారు. త్వరగా అసెంబ్లీకి పిలువడమంటే రాష్ట్ర విభజనను వేగవంతం చేయడమేనని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎస్ అన్నా నో అన్నా పార్లమెంటులో బిల్లు నెగ్గించుకుంటామని కేంద్రం చెబుతోందని, అలాంటప్పుడు అసెంబ్లీ ఏర్పాటు చేయడమెందుకన్నారు.












Click it and Unblock the Notifications