పవన్! 24గం. టైమిస్తున్నా: బొత్సతో సంబంధంపై హరీష్

హైదరాబాద్: తనకు ప్రదేశ్ కాంగ్రెసు మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం సవాల్ చేశారు. తనకు బొత్సతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని చెప్పారు.

తన పైన చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. పవన్ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తాను ఆయనకు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నానని, ఆధారాలు చూపాలన్నారు. లేదంటే ఆయన పైన పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Harish Rao challenges Pawan Kalyan

తన పైన చేసిన ఆరోపణలు నిజం కాకుండా పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చీఫ్ పబ్లిసిటీ కోసం తన పైన బురద జల్లుతున్నారన్నారు. అందుకు పవన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

తాట తీస్తారం: కడియం

తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇష్టారీతిగా మాట్లాడటం మానుకోవాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు ఆయన తాటనే తీస్తారన్నారు. అవాకులు చవాకులు పేలటం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+