టి బిల్లు: బాబుకు హరీష్ కౌంటర్, అసెంబ్లీలో గందరగోళం

నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావును గద్దె దింపేందుకు అప్పటి సభాపతిని ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చిన విషయం బాబుకు గుర్తుకు లేదా అన్నారు. నాడు ప్రత్యేక విమానానికి ఖర్చులు ఎవరు భరించారన్నారు. తెలుగుదేశం పార్టీకి నీతి, నియమాలు లేవన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చిందన్న ఆక్రోశం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు.
బిల్లుపై వాడివేడి
తెలంగాణ బిల్లు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ హాట్ హాట్‌గా ఉంది. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో రెండు మూడు రోజుల్లో చర్చ జరిపి వెంటనే పార్లమెంటుకు పంపించాలని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజెందర్ డిమాండ్ చేశారు. బిజెపి ఎమ్మెల్యేలతో పాటు నాగం జనార్ధన్ రెడ్డి సభాపతిని కలిసి అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై తక్షణమే చర్చ జరపాలన్నారు. తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కూడా దానికోసమే డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు అసెంబ్లీలో మొదట సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని సీమాంధ్ర కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలంటూ సీమాంధ్ర ప్రతినిధులు, బిల్లు ప్రవేశ పెట్టాలని తెలంగాణ ప్రతినిధులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications