బాబు, 'జగన్' నేతపై హరీష్ ధ్వజం: కేసీఆర్‌పై ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండు కళ్ల సిద్ధాంతమని చెప్పే చంద్రబాబు ఆర్డీఎస్ పనులను అడ్డుకోకుండా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పైన ప్రేమ ఉంటే పోలీసుల భద్రతతో ఆర్డీఎస్ పనులను జరిపించాలన్నారు.
ఆర్డీఎస్ పనులు ఆపేస్తుంటే.. చూస్తుండటమే బాబు రెండు కళ్ల సిద్ధాంతమా అని ప్రశ్నించారు. ఆర్డీఎస్ పనులు అడ్డుకోకుండా చూడాలని తాము కేంద్ర జలవనరుల సంఘాన్ని కోరామని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, కర్నాటక మంత్రులతో మట్లాడినట్లు చెప్పారు.

నిపుణుల నివేదికల మేరకు మేరకు ఆర్డీఎస్ పనులు జరుగుతున్నాయన్నారు. అలాంటి వాటిని అడ్డుకోవడం సరికాదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత తిక్కారెడ్డి ఆర్డీఎస్ పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పైన ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు గవర్నర్ నరసింహన్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని, బలవంతంగా ఫిరాయింపులకు పాల్పడ్డారని పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ ఆరోపించారు. అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలను రద్దు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications