ఎపి అసెంబ్లీ టీడీఎల్పీలాగా, జగన్ పార్టీ తీరు దారుణం: హరీష్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే, ఎన్టీఆర్‌భవన్‌లో తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశాల్లా ఉన్నాయని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని మాట్లాడనీయడం లేదని, వారి గొంతు నొక్కేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

అక్కడ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో అలాంటి పరిస్థితి లేదని మంత్రి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం చాలా హుందాగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలకు పూర్తి స్వేచ్ఛతో పాటు సమయాన్ని కూడా కేటాయిస్తోందని ఆయన అన్నారు.

త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్ సభ్యత్వం నమోదైందని, పార్టీ కార్యకర్తలందరికీ అవకాశాలు వస్తాయని తెలిపారు. కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ను తయారు చేసినమన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు పగటిపూట కరెంట్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నమని తెలిపారు. కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

Harish Rao says AP assembly is like TDLP meeting

తెలంగాణ శాసనసభలో ఆర్థిక పద్దులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యురాలు గీతారెడ్డి అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇస్తూ - దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రతీ సంక్షేమ కార్యక్రమం బలహీనవర్గాల అభివృద్ధికి దోహదపడేలా తయారు చేశామని చెప్పారు. గీతారెడ్డి సూచనలు తప్పకుండా పరిశీలిస్తామన్నారు.ప్లాన్‌డ్ బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించినం. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఖర్చు చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని తెలిపారు.

పాతబస్తీకి చెందిన సయ్యద్ సల్వా ఫాతిమాకు కమర్షియల్ ఫైలట్‌గా శిక్షణ పొందటానికి ముఖ్యమత్రి కేసీఆర్ ఇవాళ రూ.35.5 లక్షల చెక్కునందించారు. కమర్షినల్ ఫైలట్‌గా శిక్షణ పొందటానికి తనకు ఆర్థికసాయం చేయాలని ఫాతిమా ఇవాళ సీఎం అధికారిక నివాసానికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. ఫాతిమా విజ్ఞప్తికి వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ ఆర్థికసాయం నిమిత్తం చెక్కును అందజేశారు. తన కోరికను మన్నించి ఆర్థికంగా పూర్తి భరోసా కల్పించిన సీఎంకు ఫాతిమా శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+