తమ్ముడికే చెప్పలేదు, పవన్‌కే ఎక్కువ: చిరంజీవిపై హర్ష

 Harsha Kumar
విజయవాడ: సొంత తమ్ముడికి చెప్పలేని అన్నయ్య కాంగ్రెసును ఉద్దరిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని ఉద్దేశించి జై సమైక్యాంధ్ర పార్టీ నేత హర్ష కుమార్ మండిపడ్డారు. పదవులను పట్టుకొని పాకులాడే నాయకులు తెలుగు ప్రజలకు అన్యాయం చేశారన్నారు.

వారిలో చిరంజీవి పెద్దబిడ్డగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు పార్టీని దేశం నుండి తరమి కొట్టాలని నినాదం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వస్తున్న స్పందన సీమాంధ్రకు ద్రోహం చేసిన కాంగ్రెసును పట్టుకొని వేలాడుతున్న చిరంజీవికి రావడం లేదన్నారు.

కాగా, కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవి హాస్యనటుడిలా మాట్లాడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు తాను కారణమంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. రాష్ట్ర విభజనకు తాను ఎలా కారణమవుతానని ఆయన అడిగారు.

తాను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నానో కూడా చిరంజీవికి తెలియదని, 2010లో తాను ముఖ్యమంత్రిగా లేనని ఆయన అన్నారు. రాజకీయాల్లో తెలిస్తే మాట్లాడాలి, లేదంటే గమ్మున ఉండాలని ఆయన అన్నారు. చిరంజీవి మాటలు అజ్ఞానమని ఆయన అన్నారు. చిరంజీవి మాటలను బట్టి రాజకీయ పరిజ్ఝానం ఎంత ఉందో అర్థమవుతోందని ఆయన అన్నారు. విభజనకు తాను కారణమంటే వారి జ్ఝానానికి వదిలేస్తున్నానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+