సీఎం జగన్ ను చూశారా..!! ఏం మెయింటైన్ చేస్తున్నాడబ్బా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని చూసినవారంతా మెస్మరైజ్ అవుతున్నారు. ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల కాలం పూర్తిచేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి, లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కార్యాలయంలో వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగన్ ను చూసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలకు గురయ్యారు.

నీట్ గా షేవింగ్ చేయించుకొని..
నీట్‌గా షేవింగ్ చేయించుకొని, చక్కగా క్రాఫ్ వేయించుకొని బుద్ధిమంతుడైన రాముడు మంచి బాలుడిలా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేరోజు దసరా శరన్నతవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మనుకన్న అమ్మ.. ముగ్గురమ్మల అమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం దగ్గర కూడా అందరూ జగన్‌ను చూసి మెస్మరైజ్ అయ్యారు. అసలు వయసుకన్నా చాలా తక్కువ వయసున్న వ్యక్తిగా కనపడటమేకాకుండా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మంచి ఫిట్‌గా కనిపించారు.

క్రమం తప్పకుండా వ్యాయామం..
ప్రత్యేకంగా ఆదివారం కావడం, కార్యక్రమాలు కూడా తక్కువగా ఉండటంతో జగన్ ఉల్లాసంగా కనిపించారు. మొదటి నుంచి జగన్ మంచి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రాధాన్యతనిస్తారు. అందుకు తగ్గట్లుగా ఆహారపు అలవాట్లు మార్చుకున్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా కచ్చితంగా 40 నిముషాలు వ్యాయామం చేసేందుకు సమయం కేటాయిస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అందుకే జగన్‌కు అంత గ్లామర్ ఎలా వస్తోందంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదేమన్నా కానీ సీఎం జగన్ మాత్రం చాలా అందగాడే అంటున్నారు అందరూ.

ఓదార్పు యాత్ర సమయంలో నడక..
ఓదార్పు యాత్ర చేసేటప్పుడు మాత్రం నడక ఉంటుంది కనుక అప్పుడు ప్రత్యేకంగా డైట్ తీసుకునేవారు. ఓదార్పు యాత్రకు ముందు, ప్రస్తుతం మాత్రం క్రమం తప్పకుండా వ్యాయయం చేస్తారు. రాష్ట్ర స్థాయిలోనే పర్యటిస్తున్నారు కాబట్టి సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటున్నారు. ఢిల్లీ పర్యటనకు, విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు మాత్రం ఆయన వ్యాయామం చేయరు. ఈ వయసులో అంత అందంగా ఉన్నాడు.. ఏం మెయింటైన్ చేస్తున్నాడబ్బా.. అంటున్నారు అందరూ.












Click it and Unblock the Notifications