బుల్లెట్ వాడలేదు: డిజిపిగా దినేష్ రెడ్డి వీడ్కోలు

తాను పదవి చేపట్టే సమయానికి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అందరి సహకారంతో సమస్యలను అధిగమించినట్లు చెప్పారు. ఒక్క రబ్బర్ బుల్లెట్ ఉపయోగించకుండా శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించామన్నారు. డయల్ 100 ఏ రాష్ట్రంలో లేదని ఆయన చెప్పారు.
కాగా, తనను డిజిపిగా మరికొంత కాలం కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దినేష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ (హౌస్ మోషన్)ను ఆదివారం హైకోర్టు కొట్టి వేసింది. దీంతో కొత్త డిజిపి నియమాకానికి లైన్ క్లియర్ అయ్యింది. డిజిపి రేసులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి టిపి దాస్, అవినీతి నిరోదక శాఖ (ఎసిబి) డైరెక్టర్ జనరల్ ప్రసాద రావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
1979 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన టిపి దాస్ 2015 నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ఒడిషా రాష్ట్రానికి చెందిన వారు. ప్రసాద రావు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు. ప్రసాద రావు పదవీకాలం 2015 సెప్టెంబర్ నాటికి ముగుస్తుంది.












Click it and Unblock the Notifications