పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన: హెడ్ మాస్టర్ అరెస్టు
విజయవాడ: పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు నీచ ప్రవృత్తిని చాటుకున్నాడు. పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. కృష్ణా జిల్లా తిరువూరు విజయ బాలానికేతన్ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.
విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాఠశాలలో ఉన్న విజయ్‌కుమార్ పస్తకాల కోసం ఒంటరిగా వచ్చిన పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది.

దాంతో బాధిత విద్యార్థిని తండ్రి మంగళవారంనాడు తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థినిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications