బాబుకు తలనొప్పి: మరో వివాదంలో మంత్రి పీతల సుజాత

ఏలూరు: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంటి ఆవరణలో పది లక్షల రూపాయల నోట్ల కట్టలకు సంబంధించిన సంచి దొరికిన సంఘటన సృష్టించిన వివాదం సద్దుమణగక ముందే పీతల సుజాత మరో వివాదంలో చిక్కుకున్నారు. పీతల సుజాత విషయంలో వరుస ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది.

విజయవాడలో ఎసిబి వలలో చిక్కిన ఒక ఉద్యోగిని ఇచ్చిన వాంగ్మూలం పీతల సుజాత విషయం తాజాగా సంచలనం. తెలంగాణ రాష్ట్రంలో మొదలైన రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం వెలుగుచూసిన తరుణంలోనే మంత్రి ఇంటి ఆవరణలో రూ.10 లక్షల రూ.500 నోట్ల కట్టలు, ఒక యువతికి చెందిన డిఎస్సీ-2015 హాల్‌టిక్కెట్, ఇతర సర్ట్ఫికెట్లు కలిసివున్న సంచి కనుగొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు వెలువడే రోజు వెలుగుచూసిన ఈ ఉదంతం వివాదానికి కారణమైంది.

నోట్ల కట్టల సంచితో తనకేమీ సంబంధం లేదని, ఇందులో కుట్ర కోణం కూడా దాగివుండే అవకాశం లేకపోలేదని, అన్నీ పోలీసుల దర్యాప్తులో తేలుతాయని మంత్రి స్వయంగా ప్రకటించారు. రేవంత్‌రెడ్డి వ్యవహారంతో పీకలోతు కష్టాల్లో ఉన్న పార్టీవర్గాలు పీతల వ్యవహారం ఎటు దారితీస్తుందోనని ఆందోళనకు గురయ్యాయి. అయితే ఈ సంచి మంత్రి తండ్రిని కలవడానికి వచ్చిన ఒక రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ మరచిపోయి వెళ్లిపోయారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చడంతో వ్యవహారం సద్దుమణిగింది.

Headache with Peethala Sujatha to Chandrababu

విజయవాడలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి దొరికిపోయిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఇచ్చిన వాంగ్మూలం మరో వివాదాన్ని రేకెత్తించింది. తమ శాఖ మంత్రి సుజాత, ఆమె కుటుంబ సభ్యుల పర్యటనల సందర్భంగా అవుతున్న ఖర్చులను తట్టుకోవడానికే ఈ విధంగా లంచం తీసుకోవాల్సి వచ్చిందని సీనియర్ అసిస్టెంట్ ఎసిబి అధికార్లకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీనితో మరోసారి మంత్రి సుజాత పేరు వివాదాల తెరపైకి వచ్చింది.

ఉద్యోగిని ఇచ్చిన వాంగ్మూలం ఎంతవరకు నిలుస్తుందనే విషయం పక్కనపెడితే, కేసు విచారణ సందర్భంగా ఎసిబి న్యాయస్థానంలోనూ ఆ ఉద్యోగిని అదే వాంగ్మూలాన్ని ఇస్తే ప్రభుత్వ ప్రతిష్ఠ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాలను వేధిస్తోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో తెలంగాణ ఎసిబి నమోదుచేసిన కేసుతో తలబొప్పి కడుతుంటే, ఆంధ్ర ఎసిబి కేసు కూడా పీకలకు చుట్టుకుంటుందేమో అనే సందేహం పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+