Chandrababu: రాత్రంతా సిట్ కార్యాలయంలోనే చంద్రబాబు: 4 గంటలకు వైద్య పరీక్షలు, నీరసంగా
విజయవాడ: శనివారం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు సిట్ కార్యాలయంలోనే చంద్రబాబును ఉంచారు. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ భద్రత మధ్య విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించారు.
శనివారం సాయంత్రం 5 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఆదివారం తెల్లవారుజామునన 3 గంటల వరకూ అంటే సుమారు 10 గంటలపాటు సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. అక్కడ్నుంచి బయటకు వచ్చే సమయంలో చంద్రబాబు నీరసంగా కనిపించారు. కాగా, సిట్ కార్యాలయం నుంచి ఆస్పత్రికి చంద్రబాబును తీసుకెళుతున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశఆరు. అయితే, పోలీసులు వారిని చెదరగొట్టారు.

కాగా, చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనశ్రేణి వెంట వస్తున్న పోలీసులు, టీడీపీ కార్యకర్తలతో కనకదుర్గ వారధిపై ట్రాఫిక్ స్తంంభించింది. ఆస్పత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తలు రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లకుండా మళ్లీ సిట్ కార్యాలయానికి కాన్వాయ్‌ని తీసుకెళ్లారు.
#WATCH | Vijayawada: TDP chief and former Andhra Pradesh CM N Chandrababu Naidu was taken to Vijayawada government hospital for a medical check-up, by the CID. pic.twitter.com/KTZo4KKQ3d
— ANI (@ANI) September 9, 2023
ఇది ఇలావుండగా, నారా లోకేష్ తమ న్యాయవాదులతో ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. వారితోపాటు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, న్యాయవాదులు అక్కడకు వచ్చారు. అయితే, లూథ్రా వ్యక్తిగత భద్రతాధికారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు, ఇతర టీడీపీ నేతలను కూడా కోర్టు దగ్గరకు రాకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని జగన్ సర్కారుపై మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications