జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా, 4న గుంటూరు

YS Jagan
హైదరాబాద్: తన స్వగ్రామం ఇడుపులపాయ వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు జగన్‌కు షరతు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇడుపులపాయకు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోర్టును కోరారు. జగన్ పిటిషన్‌పై సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.

పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో రైతుల సమావేశాన్ని, ట్రాక్టర్ల ర్యాలీని అక్టోబర్ 1వ తేదీన గుంటూరులో తలపెట్టారు. బెయిల్‌పై విడుదల కావడంతో ట్రాక్టర్ల ర్యాలీకి తానే నేతృత్వం వహించాలని జగన్ భావిస్తున్నారు. అయితే, ఆ ర్యాలీని 4వ తేదీకి వాయిదా వేయాలని అనుకుంటున్నారు.

అక్టోబర్ 1,2 తేదీల్లో జగన్ ఇడుపులపాయకు వెళ్లాలని అనుకుంటున్నారు. 3వ తేదీన ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. దీంతో ర్యాలీని 4వ తేదీన నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలని కూడా జగన్ కోర్టును కోరారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలావుంటే, వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. కేసులో ప్రధాన నిందితుడు వైయస్ జగన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విజయసాయిరెడ్డి కూడా బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+