కొడాలి నానికి బైపాస్ సర్జరీ, వైద్యుల బిగ్ అప్డేట్- అభిమానుల పూజలు..!!
మాజీ మంత్రి కొడాలి నానికి ముంబాయిలో గుండె బైపాస్ సర్జరీ మొదలైంది. కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో నాని బాధ పడుతున్నారు. గత వారం ఛాతీలో నొప్పితో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో నాని చికిత్స తీసుకున్నారు. గుండె సంబంధిత పరీక్షలు చేయగా.. మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల సూచన మేరకు ముంబాయిలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఆయనకు కొద్ది సేపటి క్రితం బైపాస్ సర్జరీ మొదలైంది. ఈ సమయంలో వైద్యులు కీలక సమాచారం ఇచ్చారు. గుడివాడలో నాని అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొదలైన సర్జరీ
ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో మాజీ మంత్రి కొడాలి నానికి బైపాస్ సర్జరీ ప్రారంభమై నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రఖ్యాత వైద్యులు చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ కొనసాగుతోంది. దాదాపు ఈ సర్జరీ ఎనిమిది గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు నాని సన్నిహితులు వెల్లడించారు. కాగా, నాని ఆరోగ్య పరిస్థితి పైన మాజీ సీఎం జగన్ నిరంతరం వాకబు చేస్తున్నారు. ఈ ఉదయం నాని కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడారు. అటు వైద్యులు సైతం బైపాస్ తరువాత నాని కోలుకుంటారని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

వైద్యుల భరోసా
కొద్ది రోజుల క్రితం నాని అస్వస్థతకు గురైన సమయంలో గుండె సంబంధిత పరీక్షలు చేయగా.. మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. తొలుత స్టంట్స్ వేయాలని భావించినా.. మూడు వాల్వ్స్ లో బ్లాకులు ఉండటంతో సర్జరీ అవసరమని నిర్దారించారు. దీంతో, కొడాలి నానిని ప్రత్యేక ఫ్లైట్ లో ముంబాయికి తరలించారు. 2024 ఎన్నికలకు ముందు నుంచే నాని అనారోగ్య సమస్ యలతో హైదరాబాద్ లో తరచూ చెకప్ చేయించుకొని చికిత్స తీసుకుంటున్నారు. గత వారం ఛాతీలో నొప్పి రావటంతో ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో చేసిన పరీక్షల్లో గుండెలోని మూడు కవాటాల్లో బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. వీటి కోసం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్దారించారు. మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడిన సమయంలో వెంటనే సర్జరీ చేయించాలని సూచించారు.
అభిమానుల పూజలు
వైద్యుల సూచన మేరకు ముంబాయిలో బైపాస్ సర్జరీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీం తో, బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబాయికి కుటుంబ సభ్యులు తరలించారు. డాక్టర్ పాండా ఆధ్వర్యంలో ప్రస్తుతం నానికి బైపాస్ సర్జరీ నిర్వహిస్తున్నారు. గతంలో డాక్టర్ పాండా దివం గత ప్రధాని మన్మోహన్ సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్, కొనకళ్ల నారాయణ తో పాటుగా పలువురికి బైపాస్ సర్జరీలు చేశారు. కాగా, కొడాలి నాని ఆరోగ్యం పై మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సర్జరీ తరువాత రెండు నెలలు కొడాలి నాని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుం దని చెబుతున్నారు. ఇటు నాని అభిమానులు దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు.
నానికి చేస్తున్న సర్జరీ విజయవంతం అవ్వటంతో పాటుగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications