నిప్పుల కొలిమిలా కోస్తాంధ్ర- పలుచోట్ల 47 డిగ్రీల ఉష్ణోగ్రత-ఇవాళ,రేపు మంటలే..
కోస్తాంధ్ర నిప్పుల కొలిమిలా మారింది. గత కొన్నిరోజులుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. బంగాళాఖాతంపై నుంచి వీస్తున్న వేడిగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్ధితి కొనసాగనుందని వాతావరణ విభాగం ప్రకటించింది.

నిప్పుల కొలిమిలా కోస్తాంధ్ర
కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ప్రతీ వేసవిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం సహజమే అయినా ఈసారి మరింత పెరిగి 45 నుంచి 47 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో పలు జిల్లాల్లో జనం అల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్దితులు లేవు. తీవ్ర వడగాల్పులతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోస్తాంధ్రలోని 86 మండలాల్లో వడగాల్పుల తీవ్రత బాగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

జిల్లాలు జిల్లాల వారీగా ఇలా
కోస్తాంధ్రలోని 424 మండలాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా మోగులూరులో 45.24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా నందరాడలో 44.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 44.6, ఏలూరు జిల్లా టి.నరసాపురంలో 44.65 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణాతో పాటు పల్నాడు, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 44 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పుగోదావరితో పాటు ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.

ఇవాళ, రేపు మంటలే..
ఇవాళ, రేపు కోస్తాంధ్రలో మరింత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు రోజుల పాటు 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోసనీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా. ఇవాళ రాష్ట్రంలోని 157 మండలాల్లో వడగాలులు, 83 మండలాల్లో తీవ్ర వడగాలులు, రేపు 147 మండలాల్లో వడగాలులు, 68 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications