దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీ లోని ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ !

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ నేడు ( ఆగస్టు 18, 2025 ) వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ 24 గంటల్లో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను దాటి ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు పయనించనుందని అధికారులు స్పష్టం చేశారు.

అంతే కాకుండా ఛత్తీస్‌గఢ్‌లో మరో అల్పపీడనం విదర్భ వద్ద కేంద్రీకృతమైందని అంటున్నారు. ఇవన్నీ కలిసిపోవడంతో నైరుతి రుతుపవనాలు బలపడి బంగాళాఖాతం నుంచి కొస్తాంధ్రపైకి విస్తారంగా తేమ గాలులు వీస్తాయని.. ఫలితంగా కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

heavy-rain-alert-for-some-districts-in-ap-due-to-cyclone-effect

వర్షాల అంచనాలు..

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు: విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం. అలానే కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని తిరుపతిలో భారీ వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

రెడ్, ఆరంజ్, ఎల్లో అలర్టులు..

రెడ్ అలర్ట్‌: విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి.

ఆరంజ్ అలర్ట్‌: శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల.

ఎల్లో అలర్ట్‌: కర్నూలు, అనంతపురం, వైయస్‌ఆర్‌ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు.

ఇక వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు భద్రతా సూచికలు ఎగురవేశారు.

మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లతో సమావేశమై అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 112, 1070, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లలో విపత్తుల నిర్వహణ సంస్థను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+