పొంగుతున్న నదులు, ముంపు ముప్పు: పాలకొండల్లో జలధార, శ్రీవారి భక్తుల ఇక్కట్లు
చిత్తూరు: ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 14 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి, చంద్రగిరి, సత్యవేడి, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని కళ్యాణి డ్యాం ఎత్తివేశారు. దీంతో, గూడూరు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సనపల్లి క్రాస్ రోడ్డు వద్ద రాకపోకలు నిలిపేశారు. దీంతో తిరుపతిలో 30 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. సోమశిల జలాశయానికి భారీగా వర్షం నేరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 69వేల క్యూసెక్కులు ఉంది. ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
కైవల్యా నది, గొడ్డేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కైవల్య నది దాటుతూ నలుగురు గల్లంతయ్యారు. వెంకటగిరిలో కొందరు నీటిలో చిక్కుకున్నారు. దీంతో అధికారులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, సోమశిల నీటిమట్టం 78 టీఎంసీలు కాగా, ఇప్పుడు 57 టీఎంసీలుగా ఉంది.

కుంగుతున్న భూమి
కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలో నాయనోరిపల్లె, పెద్దముసల్ రెడ్డిపల్లెల్లో భూమి కుంగి గోతులు ఏర్పడుతున్నాయి. ఇరవై అడుగుల మేర భూమి కుంగిపోతోంది. వారం రోజులుగా వర్షం పడుతుండటంతో భూమి కుంగిపోతోందని చెబుతున్నారు.

జలపాతం
ఇటీవల కురిసిన వర్షాలకు... కడప నగర శివారులోని పాలకొండల్లో జలాలు జాలువారుతున్నాయి. రిమ్స్ సమీపంలోని పాలకొండల్లోని జలపాతాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాల వల్ల తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పరిటాల సునీత
ఆదివారం నాడు మంత్రి పరిటాల సునీత, మరో మంత్రి శిద్ధా రాఘవ రావులు మనుబోలు వద్ద జాతీయ రహదారి మరమ్మతులను పరిశీలిస్తున్న దృశ్యం.

పరిటాల సునీత
ఆదివారం నాడు మంత్రి పరిటాల సునీత, మరో మంత్రి శిద్ధా రాఘవ రావులు మనుబోలు వద్ద జాతీయ రహదారి మరమ్మతులను పరిశీలిస్తున్న దృశ్యం.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించారు. కాగా, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసిపి అధినేత జగన్ పర్యటించనున్నారు. ఆయన ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో 18,000 క్యూసెక్కుల వరద నీటిని స్వర్ణముఖి నదిలోకి వదులుతున్నారు. తిరుమలలో రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమ రహదారిలో భారీ చెట్టు కూలింది. దీంతో రాకపోకలు కాసేపు స్తంభించాయి.












Click it and Unblock the Notifications