బంగాళాఖాతంలో వాయుగుండం - ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ముందస్తుగానే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల ను తాకాయి. ఇప్పుడు రుతుపవనాలకు వాయుగుండం తోడైంది. ఇప్పటికే విస్తరించిన రుతుపవ నాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. సముద్ర తీరం వెంట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పారాదీప్‌నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయి ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఫలితంగా ఈ రోజు (శుక్రవారం) కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

heavy-rains-alerts-for-coastal-districts-due-to-depression-in-bay-of-bengal

అదే విధంగా మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం సాయంత్రం 5 గంటల నాటికి పల్నాడు జిల్లా రెంటపాళ్ళలో 47.5మిమీ, గరికపాడులో 41, సత్తెనపల్లిలో 34.5మిమీ వర్షపాతం నమోదైంది. అటు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా నల్లగొండ లలో 37, కనిష్టంగా మహబూబ్ నగర్ లో 29.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+