ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే ?
ఏపీలోని పలుప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీ స్థాయిలో.. కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆయన తెలిపారు. వర్షాలతో పాటు పిడుగుల ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.
వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు ఉపశమనం కలిగించే ఛాన్స్ ఉన్నప్పటికీ.. వర్షపాతం తీవ్రంగా ఉంటే నూనె గింజలు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.

వర్షాలు ఎక్కడెక్కడ పడే ఛాన్స్ ఉందంటే..?
ఈరోజు (04-08-2025):
భారీ వర్షాలు : అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి.
తేలికపాటి వర్షాలు: మిగతా జిల్లాల్లో.
మంగళవారం (05-08-2025):
భారీ వర్షాలు : పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి.
తేలికపాటి వర్షాలు: మిగతా జిల్లాల్లో.
బుధవారం (06-08-2025):
భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలు: పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల.
తేలికపాటి వర్షాలు: మిగతా జిల్లాల్లో.
ప్రజలకు సూచనలు..
పిడుగుల ప్రమాదం ఉన్న వేళ పొలాల్లో పనిచేయకుండా ఉండాలని రైతులకు సూచించారు.
టెంట్లు, చెట్లు వద్ద నిలుచోవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.
విద్యుత్ స్తంభాలు, నీటిలో మునిగిన ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications