3 రోజులు వర్షాలు: ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలో భారీ వర్షాలు..

తెలంగాణ దానిని ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. తూర్పు-పశ్చిమ భారతదేశం మీదుగా 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 కి.మీ నుంచి 3.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తూర్పు-పశ్చిమతో విలీనమైంది.

మూడురోజులు వర్షాలు..

మూడురోజులు వర్షాలు..

ఉత్తర కోస్తాంధ్రాలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చాలాచోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురుస్తాయని చెప్పారు.

ఉరుములతో కూడిన వర్షం..

ఉరుములతో కూడిన వర్షం..

దక్షిణకోస్తా ఆంధ్రాలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురవనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ పడనుంది. దక్షిణకోస్తా ఆంధ్రాలో రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

సీమలో కూడా

సీమలో కూడా


రాయలసీమలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురవనుంది. కర్నూలు, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ .. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాల పడనుంది.

Recommended Video

    Top News Of The Day : Thousands In China Test Positive For A New Bacterial Infection || Oneindia

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+