అమెరికాలో పవన్ సినిమా చూసి వస్తుండగా ప్రమాదం: కోమాలో ఏపీ యువకుడు

గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన మారెళ్ల జయభరత్‌రెడ్డి (24) పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో భరత్‌కు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న భరత్ శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసి కారులో వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

Help Bharat Marella for his Brain Surgery

ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, జయభారత్‌రెడ్డి తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లినట్లు తండ్రి సాంబశివారెడ్డి తెలిపారు. గుంటూరు వెంకటరమణ కాలనీ 3వ లైనులో నివాసముంటున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనీదేవి దంపతులకు జయభారత్‌రెడ్డి మూడో కుమారుడు.

తమ కుమారుడి కోసం అమెరికా వెళ్లేందుకు సహాయం చేయాలని భరత్ రెడ్డి తండ్రి సాంబశివారెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ను కోరారు. కాగా, కోమాలోకి వెళ్లిన భరత్ చికిత్స కోసం స్నేహితులు విరాళాలు సేకరిస్తున్నారు.

Help Bharat Marella for his Brain Surgery

ఇప్పటికే 50వేల డాలర్లు సేకరించగా, ఆపరేషన్ కోసం 70వేల డాలర్లకు పైగా డబ్బులు అవసరమున్నట్లు చెప్పారు. జయభరత్ రెడ్డిని ఆదుకోవాలనుకునేవారు సాత్విక్ 0019734328000, పరుషోత్తమ్ రెడ్డి 0018167288626 నెంబర్లలో సంప్రదించవచ్చు. అలాగే (https://www.gofundme.com/jcyg7xh8) సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+