HBD YSJagan: సీఎం జగన్ కు సినీ హీరోల విషెస్..!!

ముఖ్యమంత్రి జగన్ కు పలువురు సినీ హీరోలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ శ్రేణులు జగన్ జన్మదినం పండుగలా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ, గవర్నర్ తో సహా చంద్రబాబు, పవన్ కల్యాణ్ జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ బర్త్ డే నాడు అభిమానుల సందేశాలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. జగన్ చింతపల్లిలో ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతైం సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ కు సినిమా హీరోలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సూపర్ స్టార్‌ మహేశ్ బాబు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సీఎం వైయ‌స్ జ‌గన్‌కు విషెస్ తెలిపారు.

Heors Nagarjuna, Mahesh Babu extended birthday greetings to CM YS Jagan

ఇక..పార్టీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. మంత్రులు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి జగన్ చింతపల్లిలో విద్యార్ధులకు ట్యాబ్ లు పంపిణీ చేసారు అక్కడే విద్యార్ధుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసారు. సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులు..సిబ్బంది సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. ఢిల్లీలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జన్మదిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీలు కేకు కట్ చేసి వేడుక‌లు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+